ఫేస్‌బుక్‌కు ఢిల్లీ అసెంబ్లీ సమన్లు.. స్పందించిన సోషల్ మీడియా దిగ్గజం

ఇటీవల ఫేస్‌బుక్ కేంద్రంగా భారతరాజకీయాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఫేస్‌బుక్ కు సమన్లు జారీ చేసింది. ద్వేషపూరిత పోస్టులపై ఉద్దేశపూర్వకంగానే ఫేస్‌బుక్ చర్యలు తీసుకోవడం లేదని పిర్యాదులు వస్తున్నాయని ఢిల్లీ అసెంబ్లీ శాంతి, సామరస్య కమిటీ ఫేస్‌బుక్ ఇండియా ఉపాధ్యక్షుడు, మేనేజింగ్ డైరక్టర్ అజిత్ మోహన్ కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 15న తమ ఎదుట హాజరుకావలని ఆదేశించింది. అయితే, దీనిపై ఫేస్ బుక్ స్పందించింది. ఈ విషయం కేంద్రం పరిధిలోని అంశం అని తెలిపింది. ఫేస్‌బుక్ వంటి మధ్యవర్తుల నియంత్రణ కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక అధికారం పరిధిలోకి వస్తుందని, ఈ విషయాలు పార్లమెంటు పరిశీలనలో ఉన్నాయని ఫేస్‌బుక్ ఇండియా పేర్కొంది. ఈ నోటీసు అభ్యంతరకరంగా ఉందని.. కాబట్టి వెనక్కి తీసుకోవాలని కోరింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com