గాన గంధర్వుడికి అక్షర నీరాజనం

గాన గంధర్వుడికి అక్షర నీరాజనం
సప్తస్వరాలను మృదు మధురంగా, లయబద్దంగా ఆలపించిన గాయకుడివి సంగీత సరస్వతి ముద్దుబిడ్డగా, తెలుగువారికి గర్వకారణంగా

ప్రకృతిని సైతం పరవశింపజేసిన నీ గానం

ఆకట్టుకునే నీ సమ్మోహన రూపం

ఆబాల గోపాలాన్నీ కట్టిపడేసే మధురమైన నీ సంగీతం

సంగీత శిఖరాలను అధిరోహించిన నీ వ్యక్తిత్వం

విభిన్నమైన నీ నటన, వైవిధ్యమైన నీ దర్శకత్వం

విలువలు పాటించిన నీ నిర్మాణం

సుస్వరాలను అందించిన నీ సంగీతం

డబ్బింగ్ కళాకారుడిగా నీ సేవలు అజరామరం

బహుముఖ ప్రజ్ఞాశాలి అనే పదానికి నీవే నిలువెత్తు రూపం

నవ్వించావు, కవ్వించావు, మురిపించావు, మైమరిపించావు

జీవితంలో ఏ సందర్భంలో అయినా నీ పాటే పాడేలా చేశావు

నవరసాలు నీ గొంతులో పలికాయి

షడ్రుచులూ నీ గానంలో ప్రతిబింబించాయి

తెలుగు సినిమాకు సంగీత సౌధాన్ని నిర్మించిన గాన గంధర్వుడివి

సప్తస్వరాలను మృదు మధురంగా, లయబద్దంగా ఆలపించిన గాయకుడివి

సంగీత సరస్వతి ముద్దుబిడ్డగా, తెలుగువారికి గర్వకారణంగా

ఐదు తరాలకు వారధిగా నిలిచావు

బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ ఫుల్ సినిమా వరకు

అలుపెరగని నీ పాటల ప్రయాణం.. అద్వితీయం

పాట, మాట, ఆట.. ఏదైనా నువ్వు మాకు ప్రత్యేకం

సృష్టిలో పాట ఉన్నంతవరకు నీ జ్ఞాపకం చెరిగిపోదు

అయినా ఏమిచ్చి నీ రుణం తీర్చుగలం?

ప్రతిఫలంగా నీ పాట మా నోట పాడడం తప్ప..

ఏం చేసి నిన్ను మెప్పించగలం?

నీ జ్ఞాపకాల పూదోటలో ఓలలాలడం తప్ప..

నీ పాటకు మేము గులాం

నీ మాటకు మా సలాం

దివికేగిన గానగంధర్వుడా..

మరు జన్మలోనూ మా బాలూగానే తిరిగి రా!

నీ పాటల జ్ఞాపకాలతో, అశ్రునయనాలతో

ఇదే TV5 నివాళి

Tags

Next Story