Mumbai Local Train: రైల్లో సీటు కోసం రచ్చ.. జుట్టు పట్టుకుని పిచ్చ పిచ్చగా..

Mumbai Local Train: ముంబై లోకల్ రైళ్లు ప్రతిరోజూ దాదాపు ఏడు లక్షల యాభైవేల మందిని తమ గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి. అయితే ట్రైన్ ఎక్కిన తరువాత అందులో సీటు దొరకాలనుకోవడం అత్యాశే అవుతుంది.కానీ నేను ముందొచ్చాను, నాకు సీటు కావల్సిందే అని పట్టుపట్టి జుట్లు పీక్కున్నారు ఇద్దరు మహిళలు. థానే-పన్వేల్ లోకల్ రైలులో మహిళల కంపార్ట్‌మెంట్ లోపల సీటు విషయంలో కొంతమంది మహిళల మధ్య పెద్ద గొడవ జరిగింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. వీడియోలో, మహిళలు ఒకరి జుట్టు మరొకరు లాగడం చూడవచ్చు. ఓ మహిళా కానిస్టేబుల్ ప్రయాణికుల గొడవను ఆపాలని చూసినా.. తగ్గేదేలే అంటూ గొడవపడ్డారు. ఈ ప్రయత్నంలో కానిస్టేబుల్‌కు గాయాలు కూడా అయ్యాయి. సీటు విషయంలో ముగ్గురు మహిళా ప్రయాణికుల మధ్య వాగ్వాదం జరిగింది. కొద్ది సేపటికే వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో ఘర్షణకు దారితీసింది.
థానే నుండి లోకల్ రైలు ఎక్కిన ఒక వృద్ధ మహిళ, ఆమె మనవరాలు, కోపర్‌ఖైరానేలో రైలు ఎక్కిన మరో మహిళ ఖాళీ సీటు కోసం ఎదురు చూస్తున్నారని పోలీసు అధికారి తెలిపారు. సీటు ఖాళీ కావడంతో వృద్ధురాలు తన మనవరాలిని కూర్చోమని కోరింది. అదే సమయంలో, మరొక మహిళ కూడా అదే సీటులో కూర్చోవడానికి ప్రయత్నించింది. దీంతో వాగ్వాదం చోటుచేసుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

