Narendra Modi : పంజాబ్‌లో ప్రధాని మోదీ పర్యటన వ్యవహారంలో 150 మంది పై కేసు నమోదు..!

Narendra Modi : ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యం వ్యవహారానికి సంబంధించి.. ఫిరోజ్‌పూర్ పోలీసులు 150 మంది గుర్తు తెలియని వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. రహదారిపై రాకపోకలకు అంతరాయం కలిగించినందుకు జిల్లాలోని కుల్‌గరి పోలీస్‌స్టేషన్‌లో వీరిపై FIRలు నమోదయ్యాయి.
ప్రధాని మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా గత బుధవారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఫిరోజ్‌పూర్ జిల్లాలో నిరసనకారులు రహదారిని దిగ్బంధించడంతో ప్రధాని, ఆయన కాన్వాయ్ దాదాపు 20 నిమిషాల పాటు ఫ్లైఓవర్‌పై చిక్కుకుపోయింది. దీంతో ప్రధాని తన పర్యటనను అర్ధంతరంగా ముగించుకొని ఢిల్లీకి తిరుగుముఖం పట్టాల్సి వచ్చింది.
నాటకీయ పరిణామాల మధ్య ఫిరోజ్‌పూర్‌లో జరగాల్సిన సభ ఆకస్మికంగా రద్దు అయింది. పంజాబ్‌లో మోదీ అడుగుపెట్టినప్పటికీ.. సభకు హాజరు కాకుండానే తిరిగి ఆయన ఢిల్లీకి వెళ్లారు. సరైన భద్రతా చర్యలు పాటించకపోవడం వల్లే సభకు మోదీ హాజరు కాలేకపోయారని కేంద్ర హోంశాఖ తెలిపింది. ఈ ఘటన దేశంలో తీవ్ర రాజకీయ దుమారం రేపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com