కొవిడ్ హాస్పిటల్‌ ICUలో ఘోర అగ్నిప్రమాదం.. ఐదుగురు పేషంట్లు మృతి

కొవిడ్ హాస్పిటల్‌ ICUలో ఘోర అగ్నిప్రమాదం.. ఐదుగురు పేషంట్లు మృతి

గుజరాత్‌ రాజ్‌కోట్‌లోని కొవిడ్ హాస్పిటల్‌ ICUలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు కొవిడ్ బాధితులు మృత్యువాత పడ్డారు. కోవిడ్‌ బాధితులు ఉన్న ఈ హాస్పిటల్‌ నుంచి మరో 30 మందిని సురక్షితంగా కాపాడారు. రాత్రి ఒంటిగంట ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనపై.. గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణకు ఆదేశించారు. శివానంద్ హాస్పిటల్‌లో జరిగిన అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక్కడి నుంచి కాపాడిన 30 మంది కరోనా పేషంట్లను ఇతర హాస్పిటల్స్‌కు తరలించారు.


Tags

Next Story