SIT Report: సిట్ దాఖలు చేసిన మొదటి రిపోర్టు లీక్: తెలంగాణ హైకోర్టులో ఆసక్తికర వాదనలు

SIT Report: సిట్ దాఖలు చేసిన మొదటి రిపోర్టు లీక్‌పై తెలంగాణ హైకోర్టులో ఆసక్తికర వాదనలు జరిగాయి. తమకు ఇవ్వకుండా సిట్ రిపోర్టుకు చేరడంపై.. అభ్యంతర వ్యక్తం చేశారు పిటిషనర్ తరపు న్యాయవాదులు. సిట్ రిపోర్టును కోర్టులో ఇచ్చిన తర్వాతే.. పిటిషన్‌లోని వాద ప్రతివాదులకు ఇచ్చామని తెలిపారు సిట్ న్యాయవాది.
రోహిత్ రెడ్డి సిట్ రిపోర్టును సీఎంకు చేర్చి ఉండవచ్చని అన్నారు. సిట్ రిపోర్టు మీడియాకు లీక్ అవడంపై.. సిట్ ప్రెస్‌నోట్ ఇచ్చిందన్నారు అడ్వకేట్ జనరల్ రామచందర్ రావు. అటు. తదుపరి విచారణ శుక్రవారం మధ్యాహ్నం రెండున్నరకు వాయిదా పడింది.
అటు.. శ్రీనివాస్‌ను కుట్రపూరితంగా కేసులో ఇరికించారని ఆయన తరపు న్యాయవాది ఉదయ్ హల్లా వాదనలు వినిపించారు. కేసుతో సంబంధం లేనప్పటికీ విచారణకు పిలిచినా సహకరించారని కోర్టుకు తెలిపారు. సిట్ విచారణ ఎలా జరిగిందని న్యాయమూర్తి ప్రశ్నించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేరు చెప్పాలని.. సిట్ అధికారులు ఒత్తిడి చేశారని శ్రీనివాస్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కేవలం ఒక్క ఫోటో వీరికి లభించినందుకు ఏ7గా చేర్చారని.. కుటుంబ సభ్యులను సిట్ అధికారులు వేధించారని వాదనలు వినిపించారు. సిట్ వేశామని సుప్రీంకోర్టుకు చెప్పారు కానీ.. సిట్‌లో ఉన్నది హైదరాబాద్ పోలీస్ కమిషనరేనని ఆయన పేర్కొన్నారు.
ఈ దర్యాప్తు కేవలం మీడియా హైప్ కోసమేనని ఉదయ్ హల్లా వాదనలు వినిపించారు. మెజిస్ట్రేట్ ముందు ఎఫ్‌ఐఆర్ చేరక ముందే పోలీసులు మీడియాకు బ్రీఫ్ చేశారన్నారు. అయితే ఈ కేసులో పీసీ యాక్ట్ సెక్షన్-8 వర్తిస్తుందా? అని హైకోర్ట్ ప్రశ్నించింది.
అసలు డబ్బు దొరకనప్పుడు సెక్షన్-8 ఎలా వర్తిస్తుందని న్యాయవాది ఉదయ్ హల్లా పేర్కొన్నారు. కేవలం పొటికల్ గేమ్ కోసమే ఈ కేసు పెట్టారని.. ఈ కేసును స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని ఉదయ్ హల్లా కోర్టును కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com