ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్
బీజాపూర్‌ జిల్లాలో భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

ఛత్తీస్‌గఢ్ అడవుల్లో మరోసారి కాల్పుల మోతలతో దద్దరిల్లింది. బీజాపూర్‌ జిల్లాలో భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు భద్రతా సిబ్బంది మరణించగా... ఇద్దరు మావోయిస్టులు హతమైయ్యారు. మరికొంత మంది జవాన్లకు గాయాలయినట్లు ఛత్తీస్‌గఢ్ డీజీపీ డీఎం అవస్థి తెలిపారు. బీజాపూర్ జిల్లాలోని తార్రెమ్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు వెల్లడించారు. గాయపడ్డ జవాన్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

సుక్మా, బీజాపూర్ సరిహద్దు వెంబడి ఉన్న అటవీ ప్రాంతంలో భద్రతా సిబ్బంది.. నక్సల్స్‌ వ్యతిరేక ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో నక్సల్స్‌ కాల్పులు జరపగా.. భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు చేపట్టారు. ఈ ఎన్ కౌంటర్‌లో ఐదురుగు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. గత కొద్ది రోజులుగా మావోయిస్టులు రెచ్చిపోతున్నారు. గత నెల 23న నారాయణ పూర్ జిల్లాలో మావోయిస్టులు భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనాన్ని పేల్చేశారు. ఆ ఘటనలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.


Tags

Read MoreRead Less
Next Story