జాతీయం

Sonia Gandhi : కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం.. ఎగరక ముందే కిందపడ్డ జెండా..!

కాంగ్రెస్‌ జెండాను ఎగరేసే ప్రయత్నంలో గట్టిగా లాగడంలో.. అది కాస్త ఊడి సోనియాగాంధీ చేతిలో పడింది.

Sonia Gandhi : కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం.. ఎగరక ముందే కిందపడ్డ జెండా..!
X

కాంగ్రెస్‌ జెండాను ఎగరేసే ప్రయత్నంలో గట్టిగా లాగడంలో.. అది కాస్త ఊడి సోనియాగాంధీ చేతిలో పడింది. కాంగ్రెస్‌ పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయ ప్రాంగణంలో జెండా ఎగరవేసే కార్యక్రమం చేపట్టారు. జెండా ఎగరవేయడానికి సోనియాగాంధీ ప్రయత్నించినప్పటికీ.. ముడి బిగుసుకున్న కారణంగా జెండా ఎగరలేదు. దీంతో పక్కనున్న వ్యక్తి గట్టిగా లాగడంతో..సరాసరి వచ్చి సోనియా గాంధీ చేతిలోనే పడింది. ఆ తరువాత.. జెండాను సెట్ చేయించి ఎగరవేశారు. అంతకుముందు.. బీజేపీపై పరోక్షంగా సోనియాగాంధీ విమర్శలు గుప్పించారు. చరిత్రను కాలరాసి.. దేశ వారసత్వాన్ని చెరిపేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. బలమైన దేశాన్ని నిర్మించేందుకు కాంగ్రెస్‌ ఏళ్ల తరబడి కష్టించి దృఢమైన పునాదులను నిర్మించిందని సోనియాగాంధీ గుర్తుచేశారు.

Next Story

RELATED STORIES