విమాన ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. విమాన ఛార్జీల మోత మోగించిన కేంద్రం

విమాన ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే కేంద్రం విమాన ఛార్జీల మోత మోగించింది. దాదాపు 30 శాతం ఛార్జీలు పెంచుతూ సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇంధనం ధరలు పెరగడమే దీనికి కారణమంటున్నాయి విమానయాన సంస్థలు. మూడు గంటల నుంచి మూడున్నర గంటల ప్రయాణానికి ఒక్కసారిగా 5 వేల 600 రూపాయల ఛార్జీలు పెరిగాయి. ఇదివరకు 18 వేల 600 ఉన్న ఫేర్స్... 30 శాతం పెరగడంతో 24 వేల 200లకు చేరాయి.
తక్కువ దూరం ప్రయాణించాలనుకునేవారికి మాత్రం కాస్త ఊరట కలగనుంది. ఎందుకంటే కేవలం 10 శాతం ఛార్జీలు మాత్రమే పెంచింది. ఈ ఛార్జీల పెరుగుదల కనీసం 200 రూపాయల నుంచి ఉండనుందని కేంద్ర విమానయాన సంస్థ వెల్లడించింది. ఇక స్వదేశీ విమాన ప్రయాణికులపై కూడా భారం పడనుంది. ఇదివరకు 2 వేలు ఉన్న ఛార్జీలు ఇక 2 వేల 200లకు పెరగనున్నాయి. 6 వేలు ఉన్న ఛార్జీలు 7 వేల 800లకు చేరనున్నాయని కేంద్ర విమానయాన సంస్థ ప్రకటించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com