ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్ ఎప్పటి నుంచి అంటే..

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్ ఎప్పటి నుంచి అంటే..
* ఆరు రోజుల పాటు వినియోగదారులకు ప్రత్యేక డిస్కౌంట్లు *ఎస్బీఐ కార్డుదారులకు 10 శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్

ఏటా దసరా సీజన్ లో బిగ్ బిలియన్ డేస్ పేరుతో ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ పెద్ద సేల్స్ ని నిర్వహిస్తుంది. ఈ ఏడాదిలో కొద్ది రోజులుగా తేదీలు చెప్పకుండానే ప్రచారం చేసింది. ఇప్పుడా తేదీలను ప్రకటించింది. అక్టోబర్‌ 16 నుంచి 21 వరకు బిలియన్‌ డేస్‌ గా చెప్పింది. అంటే ఆరు రోజుల పాటు వినియోగదారులకు ప్రత్యేక డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. ఎస్బీఐ కార్డుదారులకు 10 శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ ను అందిస్తోంది. ఒకవేళ ఫ్లిప్ కార్ట్ మెంబర్స్ కు ప్లస్ మెంబర్ షిప్ ఉంటే అక్టోబర్ 15 నుంచే ఈ స్పెషల్ సేల్స్ అందుబాటులో ఉంటుంది.

వివిధ బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డులపై నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. పేటీఎం వ్యాలెట్‌, పేటీఎం యూపీఐ కొనుగోళ్లపై క్యాష్‌ బ్యాక్‌ ను ప్రకటించింది. టీవీలు, మొబైల్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు.. ఇంకా ఇతర వస్తువులపై డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. బిగ్ బిలియన్ డేస్ అంటే.. సేల్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకే దీని ద్వారా అదనంగా 70 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి లభించే అవకాశం ఉంది. ఇప్పటికే అమితాబ్, కోహ్లీ, అలియా, రణ్ బీర్, మహేశ్ బాబు లాంటి స్టార్స్ ప్రచారం చేస్తున్నారు. మరోవైపు అమెజాన్ కూడా గ్రేట్ ఇండియన్ సేల్ ని ఇవే తేదీల్లో నిర్వహించే ఛాన్సుంది.

Tags

Next Story