Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్ ధరించిన చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?

Nirmala Sitharaman: కేంద్ర ఆర్ధిక శాఖమంత్రిగా ఈ రోజు(మంగళవారం) నాలుగోసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్.. ప్రతి బడ్జెట్ సమావేశాలకు నిరాడంబరంగా హాజరయ్యే ఆమె.. ఈ సారి కూడా అదే తీరును అవలంభించారు. బడ్జెట్ సమయంలో ఆమె ప్రసంగాలు మాత్రమే కాదు.. ఆమె ధరించే దుస్తులు కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. చేనేత చీరలను ఎక్కువగా ఇష్టపడే ఆమె ఈ సారి ఒడిశా చేనేత చీరను ధరించి బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు.
రస్ట్ బ్రౌన్, డార్క్ మెరూన్ కలగలిసిన చీరకు ఆఫ్ వైట్ నేత బోర్డర్ మరింత ఆకర్షణీయత తెచ్చింది. ఇక బడ్జెట్ సంబంధించిన పేపర్స్ ని గతంలో ఆర్థిక మంత్రులు బ్రీఫ్‌కేసులో తీసుకొచ్చేవారు. ఇదే పద్ధతిని నిర్మలా కూడా గతంలో ఎర్రటి వస్త్రంతో చుట్టిన సంచీ(బహీ ఖాతా)లో తీసుకొచ్చారు. కానీ, ఈసారి సాఫ్ట్ కాపీని ఎరుపు రంగు పౌచ్‌లో పట్టుకుని వచ్చారు.ఇదిలావుండగా ఇప్పటివరకు ఆమె మూడుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. కానీ ఈ సారి బడ్జెట్ లో మాత్రం ఆమె తక్కువ సేపు (1గంట 30 నిమిషాలు) ప్రసంగించడం గమనార్హం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com