Anand Mahindra: రోడ్ రిపేర్‌కి ఆనంద్ మహీంద్రా సొల్యూషన్.. నెటిజెన్స్ కామెంట్స్

Anand Mahindra: ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎప్పటిలాగే చాలా రోడ్లు గుంతలతో నిండిపోయాయి. పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా దీనికి ఒక పరిష్కారం సూచించారు. మనం అమెరికన్ రోడ్ ప్యాచ్‌ను ఎందుకు ఉపయోగించకూడదు. గుంతలను సరిచేయడానికి పీల్ అండ్ స్టిక్ సొల్యూషన్. "ఇది భారతదేశానికి ఆవశ్యకమైన ఆవిష్కరణ అని నేను భావిస్తున్నాను.
కొన్ని బిల్డింగ్/కన్‌స్ట్రక్షన్ మెటీరియల్ కంపెనీ వాళ్లు దీనిని అనుకరించాలి లేదా ఈ సంస్థతో సహకరించాలి, దీన్ని ఇక్కడకు తీసుకురావాలి అని ఆయన ట్వి్ట్టర్‌లో పేర్కొన్నారు. బుధవారం నాడు, రోడ్డుపై పగుళ్లను పూడ్చడానికి కార్మికులు షీట్లు ఉపయోగిస్తున్న వీడియోను పంచుకున్నారు.
గుంతలు పడిన రోడ్ల కోసం బండాయిడ్ అని పిలవబడే ఉత్పత్తి మెరుగైనదిగా అంచనా వేయబడింది. నిజానికి రోడ్ రిపేర్ చేయాలంటే చాలా సమయం తీసుకుంటుంది. ఒక్కోసారి రోడ్ బ్లాక్ చేయాల్సి వస్తుంది. వాహనదారుల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. కానీ ఇక్కడ ఉపయోగించే విధానం అధిక నాణ్యత కలిగినది. తారు, పాలిమర్ మరియు జియో సింథటిక్ ఫైబర్ గ్లాస్ కలయిక. ఇది త్వరిత పరిష్కారం మాత్రమే కాదు, శాశ్వత పరిష్కారం కూడా అని మేకర్స్ చెబుతున్నారు.
అయితే ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్‌ను సమర్థించిన వారు కొందరైతే, మరికొందరు మనదేశంలో ఇది వర్కవుట్ కాదు సర్ అని కామెంట్ చేస్తున్నారు. భారతదేశంలోని భారీ వర్షాలకు ఇది పని చేస్తుందా అని చాలా మంది సందేహం వ్యక్తం చేస్తున్నారు.
మరికొందరు భారతదేశంలో గుంతలు పడిన రోడ్లను సరిచేయడానికి చిన్న చిన్న ప్యాచ్ వర్క్‌లు సరిపోవని, పెద్దమొత్తంలో అవసరమవుతాయని సూచించారు. ఈ షీట్లు ఎవరైనా దొంగిలించినా ఆశ్చర్యంలేదని కామెంట్ చేశారు. మరి కొందరు ఇక అధికారులు నాణ్యమైన రోడ్లను వేయడానికి స్వస్తి చెప్పి మరమ్మతులపై దృష్టి పెడతారేమో అని అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com