మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత

మాజీ ముఖ్యమంత్రి  కన్నుమూత

అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ సోమవారం కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో ఆయన మృతి చెందినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హిమాంత్ బిస్వా శర్మ తెలిపారు. ఇటీవల కరోనా నుంచి కోలుకున్న గొగోయి తిరిగి అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో కొన్నిరోజులుగా గుహవాటి మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్ ద్వారా చికిత్స అందిస్తున్నారు. దురదృష్టవశాత్తూ సోమవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. గొగోయ్ మృతి పట్ల రాష్ట్రపతి రామ్ నాథ్‌ కోవింద్, ప్రధాని మోదీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ తదితర ప్రముఖులు సంతాపం వ్యక్తంచేశారు.

తరుణ్ గొగోయ్ 1936 ఏప్రిల్ ఒకటిన ఆసోంలోని జోర్హట్ జిల్లాలో జన్మించారు. గుహవాటి యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పట్టా పొందిన ఆయన కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితం ప్రారంభించారు. 1971లో తొలిసారి ఎంపీగా ఎన్నికైన ఆయన వరుసగా ఆరు సార్లు లోక్ సభకు ఎన్నికై రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. 1986-91 మధ్య కాలలంఓ అసోం పీసీసీ అధ్యక్షుడిగానూ పనిచేశారు. అనంతరం మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా సేవలు అందించారు.

ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చిన గొగోయ్ 2001, 2006, 2011లలో వరుసగా మూడు సార్లు సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అసోంలో అత్యధిక కాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా అరుదైన రికార్డు సృష్టించారు.


Tags

Next Story