రోడ్డు ప్రమాదం : మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు గాయాలు

టీమిండియా మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. రాజస్థాన్‌లోని మధోపూర్‌లో ఆయన ప్రయాణిస్తున్న కారు టైరు పేలడంతో ఓవర్ టర్న్ అయి బోల్తా పడింది. న్యూ ఇయర్ వేడుకలని అజారుద్దీన్ బుధవారం తన కుటుంబసభ్యులతో కలిసి రాజస్తాన్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో అజారుద్దీన్ స్వల్ప గాయాలతో బయటపడగా, అయన కుటుంబసభ్యులు క్షేమంగా ఉన్నారు. అయితే స్థానిక దాబాలో పనిచేస్తున్న ఇషాన్ అనే వ్యక్తి కూడా గాయపడ్డాడు. అటు అజారుద్దీన్ భారత్ తరఫున 99 టెస్టులు, 334 వన్డేలు ఆడారు.
Former Cricketer Mohammad Azharuddin's car met with an accident in Soorwal, Rajasthan earlier today.
— ANI (@ANI) December 30, 2020
He is unhurt, as per his personal assistant. pic.twitter.com/3hpKRNMMYm
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com