కరోనాతో మాజీ మంత్రి మృతి

కరోనాతో మాజీ మంత్రి మృతి
X
మాజీ మంత్రి మాతంగి నర్సయ్య (76) కన్నుమూశారు.

ఇటీవల కొవిడ్ బారిన పడిన మాజీ మంత్రి నర్సయ్య హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. కరోనాతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉండడంతో ఆరోగ్యం విషమించింది. నర్సయ్య భార్య జోజమ్మ వారం రోజుల క్రితం మృతి చెందారు. గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మేడారం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన నర్సయ్య టీడీపీ ప్రభుత్వంలో కొంతకాలం మంత్రిగా కొనసాగారు. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Tags

Next Story