Manmohan Singh : మన్మోహన్ సింగ్‌కు డెంగ్యూ..!

Manmohan Singh : అస్వస్థతతో తాజాగా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్ నేత, మాజీ ప్రధానిమంత్రి మన్మోహన్ సింగ్ కి డెంగ్యూ అని నిర్ధారించారు ఎయిమ్స్ వైద్యులు ప్రకటించారు. ప్లేట్ లెట్స్ కౌంట్ పెరుగుతుందని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడించారు. మన్మోహన్ సింగ్‌కు కొన్ని ఏళ్లుగా సేవలందిస్తున్న పర్సనల్ ఫిజిషియన్ నితీశ్ నాయక్ గైడెన్స్‌లో కార్డియాలజిస్ట్ బృందం చికిత్స అందిస్తున్నది. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా గురువారం మన్మోహన్ సింగ్‌ని కలుసుకుని ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. కాగా ఈ ఏడాది ఆరంభంలో కరోనా కారణంగా ఆయన ఎయిమ్స్‌లో చేరారు. 2009లో మన్మోహన్ సింగ్ ఎయిమ్స్‌లో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. ప్రస్తుతం ఆయన రాజస్థాన్ నుండి రాజ్యసభ సభ్యుడుగా కొనసాగుతున్నారు. 2004 నుండి 2014 వరకు దేశ ప్రధానగా కొనసాగారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com