Amarinder Singh : అమరీందర్ సింగ్ ఓటమి..!

Amarinder Singh : అమరీందర్ సింగ్ ఓటమి..!
Amarinder Singh : వెలువడుతున్న పంజాబ్ ఎన్నికల్లో మాజీ సీఎం అమరీందర్ సింగ్ ఓటమి పాలయ్యారు.

Amarinder Singh : వెలువడుతున్న పంజాబ్ ఎన్నికల్లో మాజీ సీఎం అమరీందర్ సింగ్ ఓటమి పాలయ్యారు. పాటియాలా అర్బన్ నియోజకవర్గం నుంచి ఆప్ అభ్యర్థి అజిత్ పాల్ సింగ్ కోహ్లీ చేతిలో ఆయన ఓడిపోయారు. కాంగ్రెస్‌ను వీడి.. పంజాబ్ లోక్ కాంగ్రెస్‌ ని స్థాపించిన ఆయనకి ఈ ఎన్నికల్లో 22,862 ఓట్లు రాగా, కోహ్లీకి 36, 645 ఓట్లు పోల్ అయ్యాయి. అకాలీ నేత హర్పాల్ జునేజా 9,657 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. ఓటమిని అంగీకరిస్తూ అమరీందర్ ట్వీట్ చేశారు.. 'ప్రజల తీర్పును నేను నిరాడంబరంగా స్వీకరిస్తున్నాను' అని పేర్కొన్నారు.. విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీకి, భగవంత్ సింగ్‌కు సింగ్ అభినందనలు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story