Tamil Nadu : తమిళనాడులో మాజీ మంత్రుల అక్రమాస్తులపై ఏసీబీ వరుస దాడులు

Tamil Nadu : తమిళనాడులో మాజీ మంత్రుల ఆస్తులపై వరుస దాడులు జరుగుతున్నాయి. తాజాగా మాజీ ఆరోగ్యమంత్రి విజయభాస్కర్ ఆస్తులపై 44 ప్రాంతాల్లో మెరుపుదాడులు చేశారు ఏసీబీ అధికారులు. మాజీ మంత్రి సంబంధీకులు, బినామీలకు సంబంధించి మొత్తం ఆరు జిల్లాల్లో సోదాలు జరుగుతున్నాయి.
ఈ సోదాల్లో 23 లక్షల నగదు, 5 కేజీల బంగారం, 136 భారీ వాహనాలకు సంబంధించి రికార్డులు బయటపడ్డాయి. మాజీ మంత్రి విజయభాస్కర్ భార్య, కూతురుకు కరోనా వచ్చి, హోం క్వారంటైన్‌లో ఉన్నప్పటికీ.. అధికారులు పీపీఈ కిట్లు, గ్లౌజులు వేసుకుని ఇల్లంతా తనిఖీలు చేశారు.
అన్నాడీఎంకే ప్రభుత్వంలో మంత్రులుగా చేసిన కొందరు.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా ఆస్తులు కూడగట్టారని డీఎంకే నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆరోపణలు చేశారు. అప్పటి మంత్రులపై విచారణ జరపాల్సిందిగా గవర్నర్‌కు సైతం ఫిర్యాదు చేశారు.
ఇప్పుడు డీఎంకే అధికారంలోకి రావడంతో.. ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రుల ఆస్తులపై వేగంగా విచారణ జరుపుతోంది అధికార పార్టీ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com