మాజీ మంత్రి ఆరో పెళ్లి.. మూడో భార్య ఫిర్యాదుతో..

మాజీ మంత్రి ఆరో పెళ్లి.. మూడో భార్య ఫిర్యాదుతో..
ఆర్నెల్లు తిరక్కుండానే పెళ్లాం బోరు కొడుతుందో ఏమో.. ఇప్పటికే అయిదుగుర్ని పెళ్లి చేసుకున్న ఆయన ఆరో పెళ్లికి రెడీ అయ్యాడు.

ఆర్నెల్లు తిరక్కుండానే పెళ్లాం బోరు కొడుతుందో ఏమో.. ఇప్పటికే అయిదుగుర్ని పెళ్లి చేసుకున్న ఆయన ఆరో పెళ్లికి రెడీ అయ్యాడు. ఊరుకుంటే వందేళ్లు వచ్చినా కొత్త పెళ్లి కొడుకులా ముస్తాబవుతాడని భావించింది మూడో భార్య.

ఉత్తర ప్రదేశ్ మాజీ మంత్రి చౌదరి బషీర్ ఆరో వివాహం చేసుకోవడానికి చేసిన ప్రయత్నం అతని మూడవ భార్య అతనిపై కేసు పెట్టడంతో విఫలమైంది. బషీర్ మాయావతి క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్నారు. అక్కడి నుంచి మళ్లీ సమాజ్‌వాదీ పార్టీకి మారారు. అక్కడ కూడా ఎక్కువ కాలం ఇమడలేక ఆ పార్టీని కూడా విడిచి పెట్టారు. ప్రస్తుతం అతడు ఏ పార్టీలో లేకుండా పెళ్లిళ్లు చేసుకునే పనిలో బిజీగా ఉన్నాడు.

మీడియా నివేదికల ప్రకారం, బషీర్ మూడవ భార్య నగ్మా ఆగ్రా పోలీసులకు ఫిర్యాదు చేసింది. మాజీ మంత్రి ఆరవ వివాహం చేసుకోవాలని యోచిస్తున్నట్లు తెలుసుకున్నప్పుడు, ఆమె అతని వద్దకు వెళ్లింది. అతను తనపై దాడి చేశాడని, 'ట్రిపుల్ తలాక్' ద్వారా తనతో విడాకులు తీసుకున్నాడని ఆమె పేర్కొంది. ఆరో పెళ్లిని వ్యతిరేకిస్తుంది మూడో భార్య నగ్మాను ఇంటి నుంచి తరిమేశాడు.

2012 లో బషీర్ తనను వివాహం చేసుకున్నారని, తమకు ఇద్దరు కుమారులు ఉన్నారని నగ్మా చెప్పారు. వివాహం చేసుకున్న తర్వాత తన భర్త మరియు అతని సోదరి తనను మానసికంగా మరియు శారీరకంగా హింసించారని, కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని ఆమె ఆరోపించారు. ఆమె ఫిర్యాదుతో బషీర్ 23 రోజుల పాటు జైలు శిక్ష కూడా అనుభవించారు.

నగ్మా తన భర్తపై కొన్ని ఆరోపణలు చేస్తూ పోలీసుల నుండి సహాయం కోరిన వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. బషీర్‌పై ఐపిసి సెక్షన్ 504 మరియు ముస్లిం మహిళల వివాహ చట్టం, 2019 పై హక్కుల పరిరక్షణ చట్టం కింద కేసు నమోదు చేయబడింది.

Tags

Read MoreRead Less
Next Story