జమ్ము కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. నలుగురు ఉగ్రవాదులు హతం

జమ్ము కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. నలుగురు ఉగ్రవాదులు హతం
X

జమ్ము కశ్మీర్‌లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియన్ జిల్లా కిలూరా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కిలూరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో

శుక్రవారం ఉదయం భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో భద్రతా దళాలు జరిపిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని పేర్కొన్నారు.

Tags

Next Story