జాతీయం

UP Lockdown : యూపీలో రేపటి నుంచి సంపూర్ణ లాక్ డౌన్..!

రాష్ట్రవ్యాప్తంగా రేపు సాయంత్రం నుండి మంగళవారం( మే 4వ తేదీ ) ఉదయం 7 గంటల వరకు లాక్ డౌన్ విధించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

UP Lockdown : యూపీలో రేపటి నుంచి సంపూర్ణ లాక్ డౌన్..!
X

దేశవ్యాప్తంగా కరోనా కేసులు వీపరితంగా పెరుగుతున్న నేపధ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా రేపు సాయంత్రం నుండి మంగళవారం( మే 4వ తేదీ ) ఉదయం 7 గంటల వరకు లాక్ డౌన్ విధించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మార్కెట్లు, షాపింగ్ మాల్స్ మరియు రెస్టారెంట్లు మూసివేయబడుతాయని, కేవలం అత్యవసరమైన వాటికి మాత్రమే మినహాయింపు ఇచ్చింది. ఇక యూపీలో గణనీయంగా కరోనా కేసులు పెరుతున్నాయి. బుధవారం నాటికి ఉన్న సమాచారం మేరకు రాష్ట్రంలో కొత్తగా 29,824 కొత్త కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిసి కరోనా కేసుల సంఖ్య 11,82,848 కు చేరుకుంది. రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 11,943 గా ఉంది. ప్రస్తుతం యూపీలో 3 లక్షలకు పైగా యాక్టివ్ కేసులున్నాయి.

Next Story

RELATED STORIES