Gaganyaan Project: ఏడాదికి ఒకటి చొప్పున మూడేళ్లలో మూడు

Gaganyaan Project: ఏడాదికి ఒకటి చొప్పున మూడేళ్లలో  మూడు
X
సూర్యుని గురించి తెలుసుకునేందుకు ఆదిత్య ఎల్‌-1 మిషన్‌ కూడా రాబోతోందని వెల్లడించిన రేమెళ్ల మూర్తి

చంద్రయాన్‌-3 ప్రయోగానికి ఇస్రో సమాయత్తమవుతోంది. కరోనా కారణంగా గగన్‌యాన్‌ ప్రాజెక్టు కొంత ఆలస్యమైంది. ఏడాదికి ఒకటి చొప్పున వచ్చే మూడేళ్లలో గగన్‌యాన్‌ ప్రాజెక్టు మూడు దశల్లో జరుగుతుందని ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్‌ రేమెళ్ల మూర్తి తెలిపారు. మొదటి రెండు దశల్లో మానవ రహిత ప్రయోగం, 2025లోమానవుడు అడుగుపెట్టే ప్రయత్నాలు ఉంటాయన్నారు. విశాఖ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఖగోళ శాస్త్రం మానవ వికాసంపై దాని ప్రభావం అంశంపై జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సూర్యుని గురించి తెలుసుకునేందుకు ఆదిత్య ఎల్‌-1 మిషన్‌ కూడా రాబోతోందని రేమెళ్ల మూర్తి వెల్లడించారు.

Tags

Next Story