Gali Janardhan Reddy: రాజకీయాల్లోకి మైనింగ్ మాఫియా కింగ్; సొంత పార్టీ ప్రకటన

Ballari
Gali Janardhan Reddy: రాజకీయాల్లోకి మైనింగ్ మాఫియా కింగ్; సొంత పార్టీ ప్రకటన
మైనింగ్ మాఫియాతోనే ఖ్యాతిగడించిన గాలి జనార్థన్ రెడ్డి రాజకీయ ఆరంగేట్రం! త్వరలోనే పార్టీ ప్రకటన; 2023 ఎన్నికలే ప్రధాన ఎజెండా

Gali Janardhan Reddy: రాజకీయాల్లోకి మైనింగ్ మాఫియా కింగ్; సొంత పార్టీ ప్రకటన


మైనింగ్ మాఫియాతో దేశంలో సంచలనం సృష్టించిన గాలి జనార్ధన్ రెడ్డి రాజకీయ ఆరంగేట్రం చేయబోతున్నారట. ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన మైనింగ్ మాఫియా కింగ్ 'కల్యాణ రాజ్య ప్రగతి పక్ష' పేరిట రాజకీయ పార్టీని లాంచ్ చేశారు.


కల్యాణ కర్ణాటక ప్రాంత ప్రజలకు సేవ చేసేందుకు గానూ ఈ పార్టీని ప్రారంభించినట్లు పేర్కొన్న రెడ్డి బీదర్, యాద్గిర్, రాయ్ చుర్, కొప్పల్, కాలాబుర్గి, బళ్లారి, విజయనగర జిల్లాల అభివృద్ధికే తన పార్టీ పనిచేయబోతుందని తెలిపారు. 2023 శాసనసభ ఎన్నికల దృష్ట్యా ఈ పార్టీని లాంచ్ చేశారు.


రాబోయే ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని ప్రతి ఇంటికీ వెళ్లి ప్రచారం చేస్తానని ఈ సందర్భంగా గాలి జనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా పోరాడిన సామాజిక వేత్త బసవన్న ఆశయాలకు అణుగుణంగా తమ పార్టీ మానిఫెస్టోను సిద్ధం చేస్తున్నామని తెలిపారు.


రాబోయే ఎన్నికల్లో కొప్పల్ జిల్లాలోని గంగవతి నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్లు జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో తమ పార్టీ ఎజెండా, మానిఫెస్టో, క్యాండిడేట్లతో పాటూ ఎన్ని స్థానాల నుంచి పోటీ చేయబోతున్నదీ ప్రకటిస్తామని తెలిపారు.



Tags

Read MoreRead Less
Next Story