చనిపోయిన బిడ్డతో బస్సెక్కబోతే..

చనిపోయిన బిడ్డతో బస్సెక్కబోతే..
పచ్చని పొలాలు, పచ్చడి మెతుకులు, ఆప్యాయంగా పలకరించే నలుగురు..

చిన్నప్పుడే పెళ్లి.. పిల్లలు.. తాగుడుకు బానిసైన భర్త.. కూతురుకు అనారోగ్యం చేయడంతో ఆస్పత్రికి తీసుకెళితే అప్పటికే మరణించిందన్నారు.. ఆమె హృదయంలో ఎన్నో ఆవేదనలు.. అయినా ఆడదామని బిగ్‌బాస్ హౌస్‌కి వచ్చింది.. ఏసీ రూములు.. ఎండ తగలకుండ గదుల్లో కూసొనుడు తనకు నచ్చలేదని వచ్చిన దగ్గర్నుంచి చెబుతూనే ఉంది.. అయినా నువ్వు బయటకు వెళ్లడమనేది ప్రేక్షకులు నిర్ణయిస్తారని బిగ్ బాస్‌తో పాటు, హోస్ట్ నాగార్జున చెబుతూ వస్తున్నారు.. వచ్చినప్పుడు ఉన్నట్లు ఇప్పుడు లేదు గంగవ్వ.

పచ్చని పొలాలు, పచ్చడి మెతుకులు, ఆప్యాయంగా పలకరించే నలుగురు, అవే తనకి ఆనందాన్నిచ్చాయేమో.. అందుకే హౌస్‌లో ఉండలేకపోతోంది. భర్త తనను వదిలి మస్కట్ పోయినందుకు బాధపడ్డా.. తన్నుల బాధ తప్పిందని ఆనందం కూడా వేసిందని చెప్పింది. అదే సమయంలో కూతురికి ఫిట్స్ వస్తే జగిత్యాల ఆసుపత్రికి తీసుకువెళ్లింది. అక్కడకు వెళ్లాక డాక్టర్ బిడ్డ అప్పటికే చనిపోయిందని చెప్పారు. దాంతో చేసేది లేక బిడ్డను ఎత్తుకుని బస్సెక్కబోతే వాళ్లు ఎక్కనివ్వలేదు.

చనిపోయిన బిడ్డతో బస్సెట్లెక్కుతవ్ ఏదైన బండిలో పో అన్నారు. దాంతో ఆటోలో ఇంటికి తీసుకొచ్చిందట. అప్పటి నుంచి అన్నం సరిగ తినబుద్దైత లేదు అని గంగవ్వ ఉద్వేగానికి గురైంది. కూతురు మరణాన్ని గుర్తుకు తెచ్చుకున్న గంగవ్వ హౌస్‌లోని సభ్యులతో పంచుకుని కన్నీరు మున్నీరైంది. అవ్వని ఓదార్చే ప్రయత్నం చేశారు.. ధైర్యంగా ఉండమని చెప్పారు.

Tags

Next Story