ఢిల్లీలో కోర్టులోనే గ్యాంగ్‌వార్.. నలుగురు మృతి..!

ఢిల్లీలోని రోహిణి కోర్టులో గ్యాంగ్‌వార్ జరిగింది. ప్రత్యర్థుల కాల్పుల్లో గ్యాంగ్‌స్టర్ జితేంద్రతోపాటు మరో ముగ్గురు చనిపోయారు. కోర్ట్ రూమ్ నంబర్ 207లో కాల్పులు జరిగాయి. వాళ్లంతా లాయర్ల లాగా నల్లకోట్లు ధరించి కోర్టులోకి వచ్చి కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఈ కాల్పుల ఘటనతో ఒక్కసారిగా అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నెలకొన్నాయి. ఓ కేసు విచారణలో భాగంగా ఇవాళ జితేందర్ అలియాస్ గోగి కోర్టుకు వస్తున్నాడని తెలిసి ముందే అక్కడ కాపుకాసిన ప్రత్యర్థులు పక్కా ప్లాన్‌తో హత్య చేశారు. ఇద్దరు వ్యక్తులు లాయర్ల డ్రస్‌లో వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. కాల్పుల శబ్దం వినిపించగానే అక్కడే ఉన్న పోలీసులు అప్రమత్తమై దుండగుల్ని పట్టుకునే ప్రయత్నం చేసినా.. క్షణాల్లోనే వారు తప్పించుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com