Gas Rate In Delhi: గ్యాస్ ధర రూ.266 పెంపు.. కానీ ఇది కేవలం వాటికే వర్తిస్తుంది..

Gas Rate In Delhi (tv5news.in)
Gas Rate In Delhi: పెట్రోల్, డీజిల్, బంగారం, వెండి, గ్యాస్, నిత్యావసర సరుకులు.. ఇలా ఒకటేంటి ప్రతీ ఒక్క ధర సామాన్యుల తలపై కుంపటిలాగా మారాయి. ధరలు తగ్గుతాయేమో అని ఆశపడుతున్న వారికి రోజురోజుకీ నిరాశే ఎదురవుతోంది. ధరలు పెరగడం తప్ప తగ్గే పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు. తాజాగా మరోసారి గ్యాస్ సిలిండర్లు రేట్లు పెరగడం అందరినీ ఉలిక్కిపాటుకు గురిచేస్తోంది.
మిగతా రాష్ట్రాలతో పోలిస్తే దేశ రాజధాని ఢిల్లీలోనే ధరలు ఎక్కువగా ఉంటాయి. తాజాగా ఢిల్లీలోనే గ్యాస్ సిలిండర్ ధర ముందుగా పెరిగింది. ఆ ధర చూసి ప్రజలంతా షాక్ అవుతున్నారు. గ్యాస్ సిలిండర్ ధర రూ.266 పెరగనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కాకపోతే ఆ ధర ఇంట్లో వాడే గ్యాస్ సిలిండర్లకు కాదు.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లకు మాత్రమే.
ఇప్పటివరకు ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1734గా ఉండేది. ప్రస్తుతం అది రూ. 2000.50 కానుంది. దీంతో కమర్షియల్ గ్యాస్‌ను ఉపయోగించే ప్రతీ ఒక్కరికి ఇది పెద్ద దెబ్బే. ఇంటి గ్యాస్ ధరలు ఇప్పటికే భారంగా మారిన క్రమంలో మరోసారి దానిపై వేటు వేయకపోవడంపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com