Gay Couple Marriage : అగ్ని సాక్షిగా స్వలింగ సంపర్కుల వివాహం

Gay Couple Marriage : ఇటీవళ హైదరాబాద్ లో స్వలింగ సంపర్కులు పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా కోల్ కతాలోని గురుగ్రాంలో కూడా స్వలింగ సంపర్కులైన అభిషేక్ రే, చైతన్య శర్మ ఘనంగా తమ వివాహాన్ని జరుపుకున్నారు. ఈ దంపతుల హల్దీ వేడుక ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
స్వలింగ సంపర్కుల పెళ్లి గతంలో ఓ వింత అంశంలా చూసేవారు. కానీ ప్రభుత్వం స్పలింగ సంపర్కులకు మద్దతుగా నిర్ణయాలు తీసుకోవడంతో స్వలింగ సంపర్కులు సంతోషంగా పెళ్లిళ్లు చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు.
అభిషేక్ రే ఫ్యాషన్ డిజైనర్, చైతన్య శర్మ డిజిటల్ మార్కెటర్, ఇద్దరూ ప్రేమించుకొని వారి ఇళ్లల్లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. స్నేహితుల, కుటుంబ సభ్యుల సమక్షంలో హిందూ సాంప్రదాయ పద్ధతిలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది.
స్వలింగ సంపర్కుల పెళ్లిళ్లకు భారత దేశంలో గుర్తింపు లేదు, ఈ తరహా వివాహాలను కూడా రిజిస్టర్ చేసుకోలేరు, అయితే స్వలింగ సంపర్కుల వివాహాలను నేరంగా మాత్రం పరిగణించరని గతంలో పలు ఉదంతాలు చాటిచెప్పాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com