Bipin Rawat : సీడీఎస్ బిపిన్‌రావత్‌కు పద్మవిభూషణ్ పురస్కారం

Bipin Rawat : ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. సీడీఎస్ బిపిన్‌రావత్‌ను దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌తో గౌరవించింది. సైన్యంలో ఆయన అందించిన విశేష సేవలకు గానూ మరణానంతరం ఈ అవార్డు ప్రకటించింది. రావత్ 1958లో మార్చి 16న ఉత్తరాఖండ్‌లోని హిందూ గర్వాలీ రాజ్‌పుత్ కుటుంబంలో జన్మించారు. ఆయన కుటుంబం తరతరాలుగా సైన్యానికి సేవలు అందిస్తోంది. 1978 డిసెంబర్ 16న ఆర్మీలో చేరారు రావత్. అంచెలంచెలుగా ఎదిగిన ఆయన 2016 డిసెంబర్ 17న ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఎంపికయ్యారు. ఇద్దరు సీనియర్లను వెనక్కి నెట్టి ఆయన ఈ పదవి దక్కించుకున్నారు.
తర్వాత భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా 2020 జనవరి ఒకటిన బాధ్యతలు స్వీకరించారు. గత ఏడాదిన్నరకు పైగా చైనా విసురుతున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. అమెరికా, రష్యా, నేపాల్, శ్రీలంక, మయన్మార్, భూటాన్ తదితర దేశాల్లో పర్యటించారు. ఆయా దేశ అధ్యక్షులు, సైనిక అధికారులతో కీలక సమావేశాలు నిర్వహించారు. దేశాల మధ్య సైనిక సంబంధాలను బలోపేతం చేయడంలో కృషి చేశారు. గతేడాది డిసెంబర్లో తమిళనాడు కూనూర్ సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్, ఆయన భార్య సహా మొత్తం 14 మంది మరణించారు. ఈవార్త యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com