కొవిడ్ నుంచి కోలుకున్నా: జెనీలియా

కొవిడ్ నుంచి కోలుకున్నా: జెనీలియా
మూడు వారాల క్రితం కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్ష్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది. దాంతో నేను 21రోజులు హోం

మూడు వారాల క్రితం కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్ష్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది. దాంతో నేను 21రోజులు హోం క్వారంటైన్ లో ఉన్నాను. దేవుని దయవల్ల నేను కోలుకున్నాను.. 21 రోజుల అనంతరం మళ్లీ పరీక్ష చేయించుకుంటే నెగిటివ్ వచ్చింది అని సినీ నటి జెనీలియా ట్వీట్ చేశారు. కానీ క్వారంటైన్ లో ఒంటరిగా అన్ని రోజులు ఉండడం చాలా కష్టంగా అనిపించింది. వీడియో కాల్స్, డిజిటల్ సౌకర్యాలు అందుబాటులో ఉండడంతో నా కుటుంబం నాకు దగ్గరగానే ఉన్నారన్న భావన నన్ను త్వరగా కోలుకునేలా చేసింది. నా ప్రియమైన కుటుంబాన్ని కలుసుకున్నా. మీ కోసం, మీ వాళ్ల కోసం మీరు సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండండి. ఏదైనా సమస్య అనిపిస్తే అశ్రద్ద చేయకుండా డాక్టర్ని సంప్రదించండి. ఆరోగ్య కరమైన లక్షణాలు అలవర్చుకోండి. మహమ్మారితో పోరాడాలంటే మానసికంగా, శారీరకంగా ధృడంగా ఉండాలి అని చెప్పుకొచ్చారు జెనీలియా.

Tags

Read MoreRead Less
Next Story