జియో మార్ట్‌లో మరి కొన్ని కొత్త వస్తువులు

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) ఆన్‌లైన్ కిరాణా డెలివరీ ప్లాట్‌ఫాం జియో మార్ట్ ఇప్పుడు మరికొన్ని వస్తువులను పంపిణీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దేశవ్యాప్తంగా పాలు, గుడ్లు, బ్రెడ్‌లను పంపిణీ చేసేందుకు పైలెట్ ప్రాజెక్టును చెన్నై, బెంగళూరులలో ప్రారంభించింది. దీపావళి పండుగ నుంచి దేశవ్యాప్తంగా ఈ సేవలను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. మై జియో యాప్‌లోనే జియో మార్ట్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్ ద్వారా వినియోగదారులు కిరాణా సామాగ్రిని కొనుగోలు చేసుకునే వీలుంటుంది. ఈ యాప్‌పై క్లిక్ చేయడం ద్వారా వినియోగదారుడు జియో మార్ట్ బీటాకు చేరుకుని ఎక్కడ నుంచైనా షాపింగ్ చేసుకునే వెసులు బాటు ఉంటుంది. వినియోగ దారులు కోరుకున్న సరుకును నేరుగా రైతుల వద్దనుంచి కొనుగోలు చేసి పంపిణీ చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. జియో మార్ట్ దేశవ్యాప్తంగా 200కి పైగా నగరాల్లో అందుబాటులో ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com