జాతీయం

నాదేశం కాకపోతేనేమి.. వీళ్లంతా నా వాళ్లే: జర్మన్ క్రీడాకారిణి సహృదయం

సాయం చేయాలంటే బ్యాంకు బ్యాలెన్స్ ఉండక్కర్లేదు.. సాయం చేయాలన్న ఆలోచన ఉంటే చాలు.

నాదేశం కాకపోతేనేమి.. వీళ్లంతా నా వాళ్లే: జర్మన్ క్రీడాకారిణి సహృదయం
X

సాయం చేయాలంటే బ్యాంకు బ్యాలెన్స్ ఉండక్కర్లేదు.. సాయం చేయాలన్న ఆలోచన ఉంటే చాలు. ఉన్నంతలోనే కనీసం ఫలహారాన్ని అయినా అందించాలన్న ఆలోచన వారిని ముందుకు నడిపిస్తోంది. భారత్ లో స్థిరపడిన ఓ జర్మన్ హాకీ క్రీడాకారిణి కరోనాపై పోరులో తన వంతు సహకారం అందిస్తోంది.

ఇందుకు భర్త చేయి కూడా తోడైంది. జర్మనీకి చెందిన ఆండ్రియా క్లబ్ హాకీ క్రీడాకారిణి క్రీడల ద్వారా భారత్ లో చిన్నారులను చదువు వైపు మళ్లించాలనే మహత్తర సంకల్పంతో 2017లో భర్తతో కలిసి భారత్ వచ్చి హాకీ విలేజ్ ఇండియా అనే ప్రాజెక్ట్ చేపట్టింది.

కానీ రాజస్థాన్ లోని రెండు గ్రామాల్లో ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ అక్కడి వ్యక్తుల అవనీతి కారణంగా ముందుకు సాగలేదు. దాంతో ఆండ్రియా దంపతులు కర్ణాటకలోని కూర్గ్ వచ్చి చిన్న వ్యాపారం ప్రారంభించారు. అదీ సాగలేదు. అక్కడి నుంచి పూణే వచ్చి కొన్ని రోజులు ఉద్యోగం చేశారు.

కానీ అది కూడా ఎన్నాళ్లో చేయలేకపోయారు. చివరిగా గోవా వచ్చి బేకరీని ప్రారంభించారు జర్మనీ ప్రభుత్వ సహకారంతో. అయితే బాగానే సాగుతుందనుకున్న వ్యాపారం కరోనా కారణంగా అంతంత మాత్రంగానే సాగుతోంది.

ఇక రెండో వేవ్ కారణంగా ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవ చేస్తున్న వైద్య సిబ్బందికి తమ వంతు సాయం చేయాలనుకున్నారు. తమ బేకరి ఉత్పత్తులు రెండు వెరైటీలను ప్యాక్ చేసి స్థానిక ఆస్పత్రిలోని 50 మంది సిబ్బందికి రోజూ అందజేస్తున్నారు. ఇది మేము చేస్తున్న ఓ చిన్న సాయం మాత్రమే అని భార్యా భర్తలిద్దరూ ఎంతో వినయంగా చెబుతున్నారు .

Next Story

RELATED STORIES