గ్రేటర్ ఎన్నికలపై అమిత్ షా ప్రత్యేక దృష్టి.. దుబ్బాక తరహా విజయం సాధించాలని..

గ్రేటర్ ఎన్నికలపై అమిత్ షా ప్రత్యేక దృష్టి.. దుబ్బాక తరహా విజయం సాధించాలని..

గోల్కొండ కోటపై కాషాయం జెండా ఎగరేయాలని పట్టుదలతో ఉన్న బీజేపీ.. అందుకు తగ్గట్లు పావులు కదుపుతోంది. దుబ్బాక తరహా విజయం సాధించాలని గులాబీ పార్టీకి మైండ్ బ్లాంక్ చేయాలని తహతహలాడుతోంది. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపికను ఆచితూచి చేపడుతోంది. ఇప్పటికే 21 మందితో తొలిజాబితా ప్రకటించిన కాషాయం పార్టీ.. ఆ తర్వాత 19 మందితో రెండో జాబితా.. 34 మందితో మూడో జాబితా విడుదల చేసింది. తాజాగా 56 మంది అభ్యర్థులతో నాలుగో జాబితా విడుదల చేసింది. దీంతో ఇప్పటి వరకు 129 మంది అభ్యర్థుల్ని ప్రకటించింది.

నామినేషన్లకు శుక్రవారం చివరిరోజు కావడంతో ఇక మిగిలిన 21 మంది అభ్యర్థులను ఖరారు చేయనుంది. అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను గ్రేటర్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సీనియర్ నేతలకు అప్పగించింది అధిష్ఠానం. ఇప్పటికే ఇతర పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నేతలను పార్టీలో చేర్చుకుంటుంది. ఈ చేరికలతో కమలం పార్టీలో నయా జోష్ కనిపిస్తోంది. మరోవైపు గ్రేటర్ ఎన్నికలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ప్రత్యేక దృష్టి పెట్టడంతో కమలం నేతలు గెలుపుపై ధీమాగా ఉన్నారు.


Tags

Next Story