బ్రేకింగ్.. హైదరాబాద్ లో 72 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం.

బ్రేకింగ్.. హైదరాబాద్ లో  72 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం.
X
నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

అక్టోబర్ 12 మధ్యాహ్నం నుంచి 72 గంటల పాటు అంటే దాదాపు 3 రోజుల పాటు హైదరాబాద్ మహా నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ- గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ హెచ్చరిస్తోంది. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం కమిషనర్ డీ.ఎస్. లోకేశ్ కుమార్ 72 గంటల పాటు నగరం పరిధిలోని పలు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. కొన్ని చోట్ల 9 నుంచి 16 సెంటీమీటర్ల వర్షం పడే అవకాశం ఉందని తెలిపారు. రాబోయే 72 గంటల పాటు అధికారులు, సహాయ బృందాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

భారీ వర్షాల వలన ఏర్పడే వరద పరిస్థితిని ఎదుర్కునేందుకు ఎమర్జెన్సీ బృందాలను అప్రమత్తం చేసి, ఆయా ప్రాంతాల్లో రిలీఫ్ సెంటర్లుగా గుర్తించిన పాఠశాలలు, కమ్యూనిటీ హాల్స్, ఇతర వసతులను సిద్ధంగా ఉంచాలని సూచించారు. అధికారులు అందుబాటులో ఉండాలని కమిషనర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

Tags

Next Story