అబ్బాయితో ఉందని... అమ్మాయిని చిత్రహింసలు పెట్టిన దుండగులు..!

అబ్బాయితో కలిసి ఉందని ఓ అమ్మాయిని చిత్రహింసలు పెట్టారు కొందరు దుండగులు.. ఈ ఘటన బీహార్‌లోని గయాలో శనివారం చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఓ స్కూల్ డ్రెస్‌లో ఉన్న ఓ అమ్మాయి తన స్నేహితుడితో కలిసి కబుర్లు చెప్పుకుంటోంది. దీనిని చూసిన దుండగులు.. వారిని తప్పుగా ఉహించుకొని వేధింపులకి దిగారు.
తాము స్నేహితులం మాత్రమేనని చెప్పిన వినకుండా బెదిరింపులకి దిగారు. స్నేహితులే అయితే ఇక్కడేం పని అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దినంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరింపులకు దిగారు. చివరికి అన్నంతా పనిచేశారు. దీనితో వారు భయపడి మమ్మల్ని వదిలేయండంటూ బ్రతిమిలాడారు. అయినప్పటికీ ఆ దుండగులు వినిపించుకోలేదు.
కనీసం ఆ యువతి స్కార్ఫ్ తో ముఖం కప్పుకోవడానికి ప్రయత్నిస్తుంటే దాన్ని కూడా లాగేశారు. ఇక చేసేది ఏమీ లేకా అక్కడ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా వెంటాడి మరీ లాక్కొచ్చారు. పక్కనే ఉన్న ఆమె స్నేహితుడి పై కూడా దాడికి దిగారు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా, దీనిపైన సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ ఆదిత్య కుమార్ స్పందించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com