Bihar: ప్రియురాలి పెళ్లి మరొకరితో.. సహించలేని ప్రియుడు..

Bihar: ప్రియురాలి పెళ్లి మరొకరితో.. సహించలేని ప్రియుడు..
Bihar: ఏడాది కాలంగా ప్రేమించుకున్నారు.. నువ్వు లేకపోతే నేను లేను అనుకున్నారు.. నిన్ను విడిచి నేను ఒక్కక్షణం ఉండలేననుకున్నారు.. పెళ్లి చేసుకుని ప్రేమగీతాలు పాడుకుందామనుకున్నారు..

Bihar: ఏడాది కాలంగా ప్రేమించుకున్నారు.. నువ్వు లేకపోతే నేను లేను అనుకున్నారు.. నిన్ను విడిచి నేను ఒక్కక్షణం ఉండలేననుకున్నారు.. పెళ్లి చేసుకుని ప్రేమగీతాలు పాడుకుందామనుకున్నారు.. కానీ పెద్దలు అడ్డుకట్ట వేశారు.. చదువు సంధ్యా, పనీ పాట లేని వాడిని పెళ్లి చేసుకుని ఏం చేస్తావు.. మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాం.. నోర్మూసుకుని చెప్పినట్లు చెయ్యమన్నారు అమ్మానాన్నలతో సహా కుటుంబసభ్యులందరూ.. ఇష్టం లేక పోయినా బలవంతంగా పెళ్లికి అంగీకరించింది. ప్రియుడిని కాదని మరొకరితో తాళి కట్టించుకునేందుకు తల వంచింది.. కానీ ప్రియుడు.. ప్రియురాలు లేని జీవితాన్ని ఊహించలేకపోయాడు.. పెళ్లిమంటపానికి వచ్చి ప్రియురాలి మెడలో పూల మాల వేసి నుదుటన బొట్టు పెట్టాడు.. ఊహించని ఈ ఘటనకు పెళ్లికూతురితో పాటు, పెళ్లికి వచ్చిన పెద్ధలు కూడా షాకయ్యారు.

బిహార్‌లోని నలందా గ్రామంలో ఈ విచిత్రమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. వధువు కుటుంబ సభ్యులు అతగాడిని పట్టుకుని చితక్కొ్ట్టారు. తీవ్రగాయాలతో ఆస్పత్రిపాలయ్యాడు.. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ప్రియురాలు తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని ఫోన్ చేసిందని అందుకే తాను మంటపానికి వచ్చానని తెలిపాడు. ఇందులో తన తప్పేమీ లేదని ప్రేమికుడు అంటున్నాడు.

యువకుడిని ముఖేష్ కుమార్‌గా గుర్తించారు. యువతి కూడా అదే గ్రామానికి చెందినది. ఇద్దరూ ఏడాదికాలంగా ప్రేమించుకున్నారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు యువతికి వేరొకరితో పెళ్లి నిశ్చయించారు. ఆ పెళ్లి ఇష్టం లేని యువతి.. ప్రేమికుడికి ఫోన్ చేసి.. కలిసి జీవిద్దాం లేదంటే కలిసి చనిపోదామని చెప్పింది. తన కుటుంబ సభ్యులు తనని బలవంతంగా పెళ్లికి ఒప్పించారని ఏడుస్తూ ప్రియుడికి చెప్పింది. దాంతో ప్రియుడు పథకం వేసి ఆమె మెడలో దండ వేశాడు.. కానీ ప్రియురాలి బంధువులు కొట్టిన దెబ్బలకు ఆస్పత్రి పాలయ్యాడు.

Tags

Read MoreRead Less
Next Story