Girls Fall For Lawrence Bishnoi: గ్యాంగ్ స్టర్ కోసం ఇల్లు వదిలి వచ్చేసిన మైనర్లు...

గ్యాంగ్ స్టర్ పై మనసు పడి, అతడి పై పిచ్చి ప్రేమతో ఇల్లు విడిచి వచ్చేశారు ఇద్దరు మైనర్లు. సినిమా కథను తలపిస్తోన్న ఈ ఘటన పంజాబ్ లోని భటింఢాలో చోటుచేసుకుంది. పంజాబ్ లోని ప్రసిద్ధిగాంచిన గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ వీడియోలు చూసి ముగ్ధులైన ఇద్దరు మైనర్ బాలికలు అతడిని కలవాలన్న ఉద్దేశంతో ఇల్లు విడిచి వచ్చేశారు. తమ తల్లిదండ్రులకు చెప్పకుండా బటింఢాకు చేరుకున్నారు. లారెన్స్ ప్రస్తుతం పోలీసు అదుపులో ఉన్న సంగతి తెలిసిందే. బటింఢా సెంట్రల్ జైల్లో ఊచలు లెక్కపెడుతున్న లారెన్స్ ను ఎలాగైనా కలుసుకోవాలనుకున్న అమ్మాయిలు నేరుగా జైలు వద్దకే వచ్చేశారు. జైలు బయట సెల్ఫీలు దిగుతూ పోలీసుల కంట పడ్డారు. అనుమానస్పదం కనిపిస్తోన్న వీరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తాము లారెన్స్ కు కలుసుకునేందుకు వచ్చామని వెల్లడించారు. ఈమేరకు బాలికల తల్లిదండ్రులకు సమాచారం అందించిన పోలీసులు, ప్రస్తుతానికి వారిని సఖి సెంటర్ కు తరలిచారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com