Goa Congress : కాంగ్రెస్‌ రిసార్ట్ రాజకీయాలు.. పనాజీకి కీలక నేతలు..!

Congress (tv5news,in)

Congress (tv5news,in)

Goa Congress : ఇక్కడ బీజేపీ అధికారం చేపట్టే దిశగా వెళ్తోంది. మరోవైపు... కాంగ్రెస్‌ రిసార్ట్ రాజకీయాలకు తెర లేరింది.

Goa Congress : గోవాలోనూ బీజేపీ దూకుడు కొనసాగిస్తోంది. అతిపెద్ద పార్టీగా అవతరించింది కమలం పార్టీ. 40 స్థానాలు ఉన్న గోవా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నెలకొల్పడానికి 21 సీట్లు అవసరం అవుతాయి. ప్రస్తుతం బీజేపీ 17 స్థానాల్లోను, కాంగ్రెస్‌ 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అటు ఆప్‌ సైతం మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

ఇక్కడ బీజేపీ అధికారం చేపట్టే దిశగా వెళ్తోంది. మరోవైపు... కాంగ్రెస్‌ రిసార్ట్ రాజకీయాలకు తెర లేరింది. ఇప్పటికే కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పీ చిదంబరం, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్ సహా పలువురు సీనియర్‌ నేతలు పనాజీ చేరుకున్నారు. హంగ్ ఏర్పడితే తమ మిత్రపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేస్తుందనే ఆందోళనలో ఉన్నారు కాంగ్రెస్‌ నేతలు.

గతంలో కర్ణాటక, మధ్యప్రదేశ్‌లల్లో అర్ధాంతరంగా ప్రభుత్వాన్ని కోల్పోవాల్సి వచ్చిన పరిస్థితులను గుర్తు చేస్తోన్నారు. అధికారంలోకి రావడానికి బీజేపీ ఎంతకైనా తెగిస్తుందని, ఆపరేషన్ లోటస్ పేరుతో కోట్ల రూపాయలను గుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నారని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.

Tags

Read MoreRead Less
Next Story