ఆరోగ్య కార్యకర్తలకు గోవా ప్రభుత్వం శుభవార్త

ఆరోగ్య కార్యకర్తలకు గోవా ప్రభుత్వం శుభవార్త
కరోనా కట్టడికి గోవా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. అయినప్పటికీ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి.

కరోనా కట్టడికి గోవా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. అయినప్పటికీ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. కరోనాతో జరుగుతున్న యుద్దంలో ముందుండి పోరాటం చేస్తున్న ఆరోగ్య కార్యకర్తలు కూడా ఇటీవల ఈ మహమ్మారి బారిన‌పడుతున్నారు. దీంతో గోవా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య కార్యకర్తలకు గోవా రూ. 50 లక్షల బీమా సౌకర్యాన్ని విస్తరించింది. కరోనాతో పోరాటం చేస్తున్న ఆరోగ్య కార్యకర్తలు అందరికీ రూ. 50 లక్షల బీమా రక్షణను విస్తరించినట్లు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఆదివారం తెలిపారు. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఈ బీమా రక్షణ కల్పించబడుతుందని ఆయన సీఎం ట్వీట్ చేశారు. కరోనా విదులు నిర్వహించడం వలన మరణిస్తే.. వారికి రూ. 50 లక్షల భీమా లభిస్తుందని అన్నారు.

Tags

Next Story