తగ్గిన బంగారం ధరలు.. 10 గ్రాముల ధర..

తగ్గిన బంగారం ధరలు.. 10 గ్రాముల ధర..
కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో బంగారం నుంచి పెట్టుబడులను తరలించడం ఓ కారణంగా

భారతదేశంలో బంగారం మరియు వెండి ధరల పతనం ఈ రోజు కూడా కొనసాగుతోంది. గత నాలుగు రోజులుగా తగ్గుతున్న ధర ఈ రోజు కూడా అదేవిధంగా కొనసాగుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.600 తగ్గి రూ.51,870లకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.550 తగ్గి రూ.47,550కి చేరింది. కిలో వెండి ధర ఒక్క రోజులో రూ.2 వేలు తగ్గింది. కిలో వెండి ప్రస్తుతం మార్కెట్లో రూ.57 వేలు పలుకుతోంది. అమెరికన్ డాలర్‌లో హెచ్చు, తగ్గులతో పాటు అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరల రెండు నెలల కనిష్టానికి పడిపోయింది. కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో బంగారం నుంచి పెట్టుబడులను తరలించడం ఓ కారణంగా చెప్పవచ్చు.

Tags

Next Story