పడిపోయిన పసిడి ధరలు.. పది గ్రాములు..

పడిపోయిన పసిడి ధరలు.. పది గ్రాములు..
10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.300 తగ్గుదలతో

బంగారం ధర మళ్లీ పడిపోయింది. బంగారం ధర దిగిరావడం ఇది వరుసగా రెండో రోజు కావడం విశేషం. బంగారం ధరతో పాటు వెండి ధరలు కూడా వెలవెలపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పడిపోవడంతో దేశీ మార్కెట్లో ధరలు నేలచూపులు చూస్తున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. హైదరాబాద్ మార్కెట్లో గురువారం బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి.

10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.300 తగ్గుదలతో రూ.52,790కు క్షీణించింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.290లకు దిగొచ్చింది. దీంతో ధర రూ.48,360 కు తగ్గింది. ఇక వెండి ధర కూడా ఏకంగా రూ.600 పడిపోయింది. దీంతో కేజీ వెండి ధర రూ.62,000కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణెపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర భారీగా తగ్గి ఔన్సుకు 0.41 శాతం తగ్గుదలతో 1899 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా అదే బాటలో పయనించింది. వెండి ధర ఔన్స్‌కు 0.76 శాతం క్షీణతతో 24.20 డాలర్లకు తగ్గింది. ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్ వంటి పలు అంశాలు పసిడి ధరలపై ప్రభావం చూపుతాయి.

Tags

Read MoreRead Less
Next Story