ధంతేరాస్ స్పెషల్ ఆఫర్లు.. గోల్డ్ కొనేవారికి గుడ్ న్యూస్

ధంతేరాస్ స్పెషల్ ఆఫర్లు.. గోల్డ్ కొనేవారికి గుడ్ న్యూస్
X
ఈ రోజు బంగారం కొంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని మహిళలు విశ్వసిస్తుంటారు.

కాంతులు వెదలజల్లే దీపావళి పండుగ వచ్చేసింది.. ఇక ఈ మాసంలో వచ్చే ధనత్రయోదశి అంటే మగువలకు మరింత ఇష్టం. ఓ గ్రాము అయినా బంగారం కొనాలని ఆశ పడుతుంటారు.. ఈ రోజు బంగారం కొంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని మహిళలు విశ్వసిస్తుంటారు. అందుకే అధిక శాతం మహిళలు బంగారం కొనుగోలుకు పసిడి దుకాణాల వైపుకు అడుగులు వేస్తుంటారు.

ఇక ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకునేందుకు ఆఫర్లతో ఆకర్షిస్తుంటాయి దుకాణం యాజమాన్యాలు. క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్ లు అందిస్తున్నాయి. ప్రముఖ జ్యువెలరీ సంస్థలు ఆఫర్లను అందిస్తున్నాయి. ధంతేరాస్, దీపావళి రోజున ఎంపిక చేసిన గోల్డ్, డైమండ్ వస్తువులపై ఈ అవకాశం ఉంటుంది. పీసీ జ్యువెలరీ సంస్థ 5 శాతం క్యాష్ బ్యాక్ అందిస్తోంది. రూ.30,000 కొనుగోలు చేస్తే ఈ ఆఫర్ వర్తిస్తుంది. కోటక్ మహీంద్రా బ్యాంక్, ఆర్‌బీఎల్ బ్యాంక్ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఉన్న కస్టమర్లకే ఈ ఆఫర్ వర్తిస్తుంది.

అందే కాకుండా ఇండస్ ఇండ్ బ్యాంక్ క్రెడిట్ కార్డు కలిగిన వారికి కూడా 5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. దీని కోసం ఎలాంటి మినిమమ్ పర్చేజ్ నిబంధన లేదు. తనిష్క్ సంస్థ గోల్డ్, డైమండ్ జ్యువెలరీ మేకింగ్ చార్జీల్లో 25 శాతం వరకు తగ్గింపు అందిస్తోంది.

మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ ఏకంగా 20 శాతం వరకు తగ్గింపు ఆఫర్ అందిస్తోంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు కలిగిన కస్టమర్లకు మరో 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అలాగే ఈ సంస్థ బంగారం కొనుగోలుకు సమానమైన వెండిని ఉచితంగా అందిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. 10 శాతం చెల్లించి జ్యువెలరీని బుక్ చేసుకోవచ్చు.

ఇక జోయలుక్కాస్ అయితే డైమండ్, కట్ డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై 1 గ్రాము బంగారు కాయిన్‌ను ఉచితంగా అందిస్తోంది. రూ.50,000కు పైన బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే 200 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ఉచితంగా పొందొచ్చంటున్నారు. అయితే నవంబర్ 15 వరకే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది అని బంగారం ప్రియులకు చిన్న షాక్ ఇచ్చింది.

Tags

Next Story