పసిడి ధర మరింత తగ్గి పది గ్రాములు..

పసిడి ధర మరింత తగ్గి పది గ్రాములు..
బంగారం ప్రియులకు శుభవార్త..

పండుగ సీజన్‌లో పసిడి ధరలు తగ్గుముఖం పట్టడం బంగారం ప్రియులకు శుభవార్తలాంటిది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. గత రెండు రోజులుగా 24 క్యారెట్లున్న10 గ్రాముల బంగారం ధర రూ.490 తగ్గి రూ.52,360కు క్షీణించింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం ధర రూ.450 తగ్గి రూ.48,000కు చేరింది. ఇక ఇదే బాటలో వెండి కూడా పయనిస్తోంది. కేజీ వెండి ధర ఏకంగా రూ.1,000 దిగొచ్చింది. దీంతో ధర రూ.61 వేలకు క్షీణించింది. కానీ అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి.

ఈక్విటీ మార్కెట్లో బంగారం అమ్మకాలు జోరందుకుంటున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం ధరల్లో హెచ్చు తగ్గులకు చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు ప్రభావం చూపుతాయి.

Tags

Read MoreRead Less
Next Story