Gold Razor: సెలూన్ స్పెషాలిటీ.. గోల్డ్ రేజర్‌తో గడ్డం గీయడం..
Gold Razor: గోల్డ్ రేజర్‌తో గడ్డం గీస్తే కాస్ట్ ఎక్కువనుకుంటున్నారా.. అస్సలు కాదు..

కరోనా భయం కస్టమర్లను ఇంకా వెంటాడుతూనే ఉంది. సండే వస్తే సెలూన్‌కి వెళ్లి హాయిగా రిలాక్స్‌డ్‌గా కూర్చుని షేవ్ చేయించుకుందామనుకునే వారి సంఖ్య ఇంకా తక్కువగానే ఉంది.. పరిస్థితి ఇలానే ఉంటే కోలుకునేది ఎలా.. ఇదే ఆధారంగా బతుకుతున్న తమకి జీవనాధారం ఏమిటి అని మదనపడేవారు మహారాష్ట్రకు చెందిన అవినాష్.. వినియోగదారులను ఆకర్షించేందుకు ఓ వినూత్న ఐడియాకు శ్రీకారం చుట్టాడు.
కరోనాకి ముందు పూణేలో ఉన్న తన సెలూన్‌కు కస్టమర్లు క్యూ కట్టేవారు. ఇప్పుడేమో ఈగలు తోలుకోవాల్సి వస్తుంది. ప్రతి రోజు షాపుని శానిటైజ్ చేస్తూ జాగ్రత్తలెన్ని తీసుకున్నా కస్టమర్లలో ఉన్న భయం పోవట్లేదు. ఇలాంటి పరిస్థితిలో వినియోగదారులను పెంచుకునే నిమిత్తం గడ్డం గీసేందుకు గోల్డ్ రేజర్ ఉపయోగించాలని ఆలోచన చేశాడు.
అనుకున్నదే తడవుగా ఆర్డర్ ఇవ్వడానికి కని బంగారు దుకాణదారుడి దగ్గరకు వెళ్లాడు.. మొదట విని అవాక్కయ్యాడు.. తరువాత అతడు చెప్పిన వస్తువు తయారు చేసి ఇస్తానన్నాడు. బంగారు రేజర్ తయారు చేసినందుకు దాదాపు 4 లక్షల రూపాయలు ఖర్చైంది. ఇందుకోసం 80 గ్రాముల బంగారం వాడాల్సి వచ్చింది. మరి గోల్డ్ రేజర్‌తో గడ్డం గీస్తున్నందుకు ఎక్కువ ఛార్జ్ వసూలు చేస్తాడనుకుంటే పొరపాటే.. కేవలం రూ.100లు మాత్రమే తీసుకుంటున్నాడు.. తన సెలూన్‌కి మునుపటిలా ఎక్కువ మంది కస్టమర్లు వస్తే అంతే చాలనుకుంటున్నాడు. నిజంగా తన ప్రయత్నం ఫలించి ఇప్పుడిప్పుడే వ్యాపారం మళ్లీ పుంజుకుంటోందని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు అవినాష్.
RELATED STORIES
Vismaya-Case: నా కూతురి ఆత్మ కారులోనే ఉంది.. అతడికి యావజ్జీవ శిక్ష...
24 May 2022 1:15 PM GMTTamil Nadu: బిర్యానీ లేదు.. అందుకే పెళ్లి వాయిదా..!
24 May 2022 12:40 PM GMTKarnataka: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ, ప్రైవేట్ బస్సు ఢీ.. 9...
24 May 2022 8:50 AM GMTSrilanka Crisis: శ్రీలంక సంక్షోభం.. రికార్డు స్థాయిలో పెట్రో, డీజిల్...
24 May 2022 7:47 AM GMTPetrol And Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్‌ను తగ్గించిన...
23 May 2022 2:15 PM GMTMadhya Pradesh: భార్య కష్టం చూడలేక మోపెడ్ కొన్న బెగ్గర్
23 May 2022 12:00 PM GMT