కొత్తగా ఇల్లు కొనేవారికి కేంద్రం శుభవార్త!

కొత్తగా ఇల్లు కొనేవారికి కేంద్రం శుభవార్త!
కొత్తగా ఇల్లు కొనేవారికి కేంద్రం శుభవార్త చెప్పింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని మరో ఏడాది పొడిగించింది. 2022వ సంవత్సరం మార్చి 31 వరకు ఈ పథకం కొనసాగనుంది.

కొత్తగా ఇల్లు కొనేవారికి కేంద్రం శుభవార్త చెప్పింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని మరో ఏడాది పొడిగించింది. 2022వ సంవత్సరం మార్చి 31 వరకు ఈ పథకం కొనసాగనుంది. 2022 వరకు దేశంలోని అందరికీ ఇళ్లు అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకం తెచ్చింది. కొత్తగా ఇల్లు కొనుగోలు చేసినవారికి ఈ పథకం కింద కేంద్రం రాయితీ ఇస్తుంది.

దాదాపు 2 లక్షల 65 వేల వరకు కేంద్రం ఆర్థిక సాయం చేస్తుంది. అయితే దీన్ని లబ్ధిదారుడికి నేరుగా ఇవ్వదు. బ్యాంకు రుణం తీసుకుంటే రాయితీని బ్యాంకుకే అందజేస్తుంది. దీంతో లబ్ధిదారుడి తీసుకున్న రుణం అసలు లోంచి తగ్గిస్తారు. ఫలితంగా ఈఎంఐ తగ్గుతుంది. అసలు, వడ్డీని కలుపుకుంటే లబ్దిదారుడికి దాదాపు 6 లక్షల వరకు లబ్ది చేకూరుతుంది.

కేంద్రం ఈ బడ్జెట్‌లో వీధి వ్యాపారులకు కాస్త ఊరటనిచ్చింది. వారిని సామాజిక భద్రత పథకాల్లో చేర్చింది. ఇన్నాళ్లు వీధి వ్యాపారులకు భద్రత కరువైంది. నష్టపోయినా వారి గోడు ఎవరికీ పట్టేది కాదు. సామాజిక భద్రత పథకాల్లో చేర్చాలనే నిర్ణయంతో లక్షలాది మందికి మేలు జరుగుతుందని అంటోంది కేంద్ర ప్రభుత్వం.

డిజిటల్ చెల్లింపులను కేంద్రం ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం బడ్జెట్‌లో ఏకంగా 1500 కోట్లు కేటాయించింది. నగదు రహిత లావాదేవీలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తూ వస్తోంది. లాక్‌డౌన్ నుంచి డిజిటల్ లావాదేవీలు దేశ వ్యాప్తంగా పెరిగాయి. నోట్ల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందనే భయంతో చాలామంది డిజిటల్ చెల్లింపులకే ప్రాధాన్యతనిచ్చారు.

డిజిటల్ పేమెంట్స్‌ కోసం కేంద్రం ప్రత్యేకంగా UPIని తెచ్చి పేమెంట్ వాలెట్లను దీని పరిధిలోకి తెచ్చింది. డిజిటల్ విధానంలోనే బడ్జెట్ ప్రవేశ పెట్టిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్... జనాభా లెక్కలను కూడా డిజిటల్ పద్ధతిలోనే చేపట్టనున్నట్లు ప్రకటించారు.

Tags

Read MoreRead Less
Next Story