Indian Railways: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇకపై ఈ సౌకర్యం..

Indian Railways: భారతీయ రైల్వే తమ ప్రయాణీకులకు శుభవార్త చెప్పింది. ఇది ప్రయాణీకులకు గొప్ప ఉపశమనం. వాస్తవానికి, సుదూర ప్రాంతాలు రైళ్లలో ప్రయాణం అంటే లగేజీ ఎక్కువగా ఉంటుంది. దానికి తోడు దుప్పట్లు కూడా తీసుకువెళ్లాలంటే మరింత కష్టం.
మార్చి 2020 నుండి ప్రజలకు షీట్లు, దిండ్లు, దుప్పట్లు జారీ చేయడం నిలిపివేసింది. కరోనా కారణంగా, ప్రజలకు ఆ సౌకర్యాన్ని ఆపేసింది. అయితే ఇప్పుడు రైల్వే శాఖ ఈ సేవను తక్షణం అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. అంటే నేటి నుంచి ప్రయాణీకులకు దుప్పట్లు అందించబడతాయి.
ఇందుకోసం తక్షణమే ఈ వస్తువుల సరఫరాను పునరుద్ధరించాలని రైల్వే బోర్డు అన్ని రైల్వే జోన్‌ల జనరల్ మేనేజర్‌లకు జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. అదనపు లగేజీతో ప్రయాణం వారికి ఇబ్బంది కలిగిస్తుంది. దాంతో ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు తక్షణమే స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నారు.
అన్ని రైళ్లలోని ఏసీ కోచ్‌లకు రైల్వేలు దుప్పట్లు, దిండ్లు అందజేస్తాయి. రైల్వే కొన్ని రోజులపాటు ప్రజలకు డిస్పోజబుల్ బెడ్‌రోల్ కిట్‌లను అందించింది. ఇందుకోసం ప్రయాణికులు విడిగా డబ్బులు చెల్లించాల్సి వచ్చేది. అయితే ప్రస్తుతం అది కూడా మూతపడింది. దాంతో ప్రజలు బెడ్ షీట్ సౌకర్యాన్ని పునరుద్ధరించమని రైల్వే అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో మళ్లీ అమల్లోకి వచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com