Swiggy: డెలివరీ బాయ్స్ కష్టాలకు చెక్..

Swiggy: కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు.. ఎదుగూ బొదుగులేని జీవితాలు ఎన్నాళ్లిలా అని ఎవరికి మాత్రం అనిపించదు. వారి కష్టాలకు చెక్ పడే రోజు వచ్చింది.
కస్టమర్ల కోరిక మేరకు సమయానికి ఫుడ్ అందించే డెలివరీ బాయ్ ల జీవితాల్లో మార్పు రానుంది. డెలివరీ బాయ్ నుంచి మేనజర్లు అయ్యే స్థాయికి చేరుకోవచ్చు. పైలెట్ ప్రాజెక్ట్ కింద స్విగ్గీ సంస్థలో పని చేస్తున్న డెలివరీ బాయ్స్ ను మేనేజర్లుగా నియమించుకోనున్నట్లు రిపోర్ట్ లు వెలుగులోకి వచ్చాయి.
5,6 ఏళ్లు అనుభవం ఉన్న ఉద్యోగుల్ని అర్హతల ఆధారంగా మేనేజర్లుగా ప్రమోట్ చేయనుంది. అయితే ఇందుకోసం కంపెనీ నిర్వహించే ఇంటర్వ్యూలో ప్రతిభ కనబర్చాల్సి ఉంటుంది.
ప్రస్తుతం రూ.15 వేల నుంచి రూ.18వేల వరకు సంపాదిస్తున్న స్విగ్గీ బాయ్ లు మేనేజర్ లుగా బాధ్యతలు చేపడితే సంవత్సరానికి రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు శాలరీలు ఉండొచ్చు.
ఏరియా మేనేజర్ స్థాయి ఉద్యోగులకు అయితే అనుభవం ఆధారంగా జీతం ఉంటుంది. వారికి సుమారు రూ.11 లక్షల వరకు ఉండొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com