ప‌ట్టాలు త‌ప్పిన గూడ్స్ ట్రైన్

ప‌ట్టాలు త‌ప్పిన గూడ్స్ ట్రైన్

గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పింది. ఆగ్రా-ఢిల్లీ మార్గంలోని మ‌థుర వ‌ద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ట్రైన్ నాలుగు బోగీలు ప‌ట్టాలు త‌ప్పాయి. రైలు ప‌ట్టాలు దెబ్బ‌తిన్న కార‌ణంగా ఈ ప్ర‌మాదం సంభ‌వించింది. ఈ ప్ర‌మాదం నేప‌థ్యంలో ఢిల్లీ-ఆగ్రా మార్గంలో రైళ్ల రాక‌పోకల‌కు అంత‌రాయం ఏర్ప‌డింది.

ఢిల్లీ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు ఛ‌త్తికారా గ్రామ సమీపంలో ఓవ‌ర్ బ్రిడ్జి దగ్గరకి చేరుకునే స‌రికి ఒక్క‌సారిగా ట్రైన్ నాలుగు బోగీలు ప‌ట్టాలు త‌ప్పాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ మార్గానికి పూర్తిగా అంత‌రాయం ఏర్ప‌డింది. దీంతో రైల్వే అధికారులు త‌క్ష‌ణం ట్రాక్ పున‌రుద్ధ‌ర‌ణ ప‌నుల‌ను చేప‌ట్టారు.

Tags

Next Story