Amarinder Singh : పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు

Amarinder singh : పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నవజ్యోత్ సింగ్ సిద్ధును తిరిగి మంత్రి పదవిలోకి తీసుకోవాలని పాకిస్థాన్ నుంచి గతంలో తనకు రాయబారం అందిందన్నారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పేరుతో ఓ సందేశం వచ్చినట్లు ఆరోపించారు. పంజాబ్ రాజకీయాల్లో కెప్టెన్, సిద్ధూ మధ్య వివాదం అప్పట్లో సంచలనంగా మారింది.
ఇరువురి మధ్య విబేధాల నేపథ్యంలో సిద్ధూ.. సొంత పార్టీపైనే విమర్శలు చేశారు. ఈ వివాదాలు కాస్తా కాంగ్రెస్ పార్టీలో సంక్షోభానికి తెరలేపాయి. దీంతో సిద్ధూను మంత్రి పదవి నుంచి కెప్టెన్ తొలగించారు. ఈ క్రమంలోనే.. సిద్ధూను మళ్లీ మంత్రి పదవిలోకి తీసుకోవటంపై పాకిస్థాన్ ప్రధాని లాబీయింగ్ చేసినట్లు అమరీందర్ తాజాగా షాకింగ్ కామెంట్లు చేశారు.
ఇక ఇప్పటికే మాజీసీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్‌తో కాషాయ పార్టీ పొత్తు ఖరారు కాగా... తాజాగా సీట్ల సర్ధుబాటు ప్రక్రియను పూర్తిచేశారు. పొత్తులో భాగంగా కెప్టెన్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్ 35 స్ధానాల్లో పోటీ చేయబోతోంది. సుఖ్ధేవ్ సింగ్ ధిండ్సా నేతృత్వంలోని శిరోమణి అకాలీదళ్ 15 స్ధానాల్లో బరిలో దిగనుంది. బీజేపీ 65 స్ధానాల్లో పోటీ చేయనుంది. ఇక ఫిబ్రవరి 20న ఒకే దశలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com