ఈ యాప్‌తో రేషన్ నేరుగా ఇంటికే !

మేరా రేషన్.. మేరా ఘర్ పర్ అన్నట్లుగా కేంద్రం సబ్సిడీ ధాన్యాల సరఫరా కోసం ఓ యాప్ లాంచ్ చేసింది. రేషన్ కార్డు హోల్డర్లందరూ ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే, ప్రత్యేకించి పనులు కోసం సొంతూళ్లకి దూరంగా ఇతర ప్రాంతాల్లో బతుకు బండి నడిపేవాళ్లకి ఇది లాభదాయకమని కేంద్రం ప్రకటించింది. వన్ నేషన్ వన్ కార్డ్ కాన్సెప్ట్‌ని విజయవంతం చేసేందుకు ఈ యాప్ చక్కగా పనికి వస్తుందని ఫుడ్ సెక్రటరీ సుదాంశు పాండే చెప్తున్నారు..
కొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా ఈ వన్ రేషన్ కార్డ్ వన్ నేషన్ కార్యక్రమం అమలు కానుంది. ప్రస్తుతానికి 32 రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలు ఈ కార్యక్రమం కింద ఎన్‌రోల్ అవగా, అస్సోం, చత్తీస్ ఘడ్, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్ చేరలేదు. 69కోట్లమందికి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద సరుకుల పంపిణీ జరుగుతోంది. ఇలా ఇతర రాష్ట్రాల్లో నివసిస్తూ కూడా కార్డు హోల్డర్లు సరుకులు అందుకోవడం నెలకి 1.5కోట్ల నుంచి 1.6కోట్లకి చేరినట్లు కేంద్రం చెబుతోంది.
ఇలా యాప్‌తో ప్రజా పంపిణీ వ్యవస్థలో కేంద్రానికి వచ్చే లాభం ఏమిటంటే, బోలెడంత సమయం ఆదా ఆవడంతో పాటు, రేషన్ షాపుల నిర్వహణ కూడా సులభం అవుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

