మద్యం గొడవ.. పెళ్లైన రోజే వరుడ్ని హత్య చేసిన స్నేహితులు

మద్యం గొడవ.. పెళ్లైన రోజే వరుడ్ని హత్య చేసిన స్నేహితులు
చిన్న వివాదం.. చిలువలు పలువలై పెద్దదిగా మారుతుంది.. మనుషుల ప్రాణాలు తీసే స్థాయికి చేరుతోంది.

పెళ్లికి ముందు బ్యాచిలర్ పార్టీ.. పెళ్లైన తరువాత వెడ్డింగ్ పార్టీ.. అన్ని పార్టీలకీ మద్యం ప్రధానం. తాగినోడు ఏం చేస్తాడో వాడికే తెలియదు. మందు తక్కువైనా గొడవే.. ఎక్కువైనా గొడవే. ఆ గొడవ పెద్దదైతే చంపుకునేదాకా వెళుతున్నారు.

చిన్న వివాదం.. చిలువలు పలువలై పెద్దదిగా మారుతుంది.. మనుషుల ప్రాణాలు తీసే స్థాయికి చేరుతోంది. ఆవేశం కట్టలు తెంచుకోవడంతో ఆలోచించే విచక్షణ కోల్పోతున్నారు. తాజాగా ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన పెళ్లై 24 గంటలు కూడా గడవ ముందే వరుడు హత్యగావింపబడ్డాడు. పాలిముకిమ్ పూర్ గ్రామానికి చెందిన బబ్లూ (28) అనే వ్యక్తికి సోమవారం వివాహం జరిగింది. స్నేహితుల కోసం ప్రత్యేకంగా విందు, మందు ఏర్పాటు చేశాడు పెళ్లికొడుకు.

వివాహం పూర్తయిన తరువాత తన స్నేహితులను కలుద్దామని వెళ్లాడు బబ్లూ. అప్పటికే ఫుల్లుగా మద్యం తాగి జోగుతున్న స్నేహితులు అతడిని చూడగానే మరికొంత మద్యం కావాలని అడిగారు. అందుకు బబ్లూ అంగీకరించకపోవడంతో వారి మద్య గొడవ మొదలైంది. మాటా మాటా పెరిగింది.. వివాదం తారా స్థాయికి చేరుకుంది. విచక్షణ కోల్పోయిన స్నేహితులు కొత్త పెళ్లికొడుకు అని కూడా చూడకుండా అతడిపై కత్తితో దాడి చేశారు.

దాంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే తేరుకున్న స్నేహితులు బబ్లూని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ ఈలోపే అతడు మరణించాడని డాక్టర్లు ధృవీకరించారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనలో ప్రధాన నిందితుడు రామ్ ఖిలాడ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. మరో అయిదుగురు స్నేహితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Tags

Next Story